calender_icon.png 18 February, 2026 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో ఉద్యోగ జేఏసీ గర్జన

18-02-2026 12:00:00 AM

  1. ఆప్షన్లు అడగకుండానే ఏకపక్షంగా బదిలీలా?
  2. అధికారుల తీరుపై నిప్పులు
  3. తొమ్మిది సంఘాలతో జేఏసీ ఏర్పాటు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ విభజన మూడు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రి య ఇప్పుడు ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. ఉద్యోగుల నుంచి కనీస అభిప్రాయం లేదా ఆప్షన్లు తీసుకోకుండానే అధికారులు ఏకపక్షంగా చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీస్తోంది.

అధికారుల ఇష్టారా జ్యంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తమ సీనియారిటీ, కెరీర్ దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్న ఉద్యోగులు.. తమ హక్కుల పోరాటం కోసం ఏకమయ్యారు. ఈ క్రమంలో తొమ్మిది ప్రధాన ఉద్యోగ, కార్మిక సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. ఈ జేఏసీ మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో తన మొట్టమొదటి కీలక సమావేశాన్ని నిర్వహించి, ప్రభుత్వానికి అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు అధికారులు మొండిచేయి చూపారని జేఏసీ నేతలు మండిపడ్డారు. మొత్తం 284 మంది ఉద్యోగులు పదోన్నతులకు అర్హత కలిగి ఉంటే, కేవలం 74 మందికి మాత్రమే పదోన్నతులు కల్పించడం వెనుక అంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత కామన్ సీనియారిటీ వ్యవస్థ ఉంటుందా.. లేక విడివిడిగా జాబితాలు రూపొందిస్తారా.. అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో సర్వీసు రక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పునర్వ్యవస్థీకరణ సాకుతో ఏ ఒక్క ఉద్యోగికి నష్టం కలగకూడదని, వెంటనే పారద ర్శకమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బదిలీల ప్రక్రియలో అధికారులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరించారని జేఏసీ తీవ్రంగా విమర్శించింది. నివాస ప్రాంతాలకు దగ్గరగా బదిలీ చేయాలనే నిబంధ నను పక్కనబెట్టడమే కాకుండా.. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పదవీ విరమణకు చేరువలో ఉన్న వద్ధ ఉద్యోగుల పట్ల కనికరం చూపలేదని మండిపడింది.

మానవ తా దక్పథంతో తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వా లని వారు కోరారు. మూడు కార్పొరేషన్లలో కామన్ సీనియారిటీని కొనసాగిస్తూ తక్షణమే అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని, ఉద్యోగులందరికీ ఒకసారి ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని కోరింది. అలాగే క్యాడర్ పునర్వ్యవస్థీకరణ, సీనియారిటీ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయా లని డిమాండ్ చేసింది. ఈ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో హక్కుల రక్షణ కోసం ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించింది.