విపంచి ఫౌండేషన్ ఉగాది పురస్కారానికి ఝాన్సీ రాజిరెడ్డి ఎంపిక
23న రవీంద్ర భారతిలో ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారం
తుంగతుర్తి, మార్చి 20: గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ గ్రంథాలయం కు విపంచి ఫౌండేషన్ ఉగాది పురస్కారం లభించింది. గ్రామీణ ప్రజల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
గ్రామీణ ప్రాంతా గ్రంథాలయాల ఆధునీకరణ, కొత్త పుస్తకాల సేకరణ, పాఠకులకు సౌకర్యాల కల్పన వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వాతావరణాన్ని మెరుగుపరిచారు. ఈ కృషిని గుర్తించిన విపంచి ఫౌండేషన్ ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారానికి దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాయం ఝాన్సీ రాజిరెడ్డి నీ ప్రత్యేక జూరి కమిటీ ఎంపిక చేసింది.ఈ సందర్భంగా గ్రామస్థులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, మరింత అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.




