సురంగల్‌లో ముస్లింకు ఇప్తార్ విందు
మొయినాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): రంజాన్ మాసం సందర్భంగా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్లో 14వ వార్డ్ కౌన్సిలర్ కర్రోల శ్రీధర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఐక్యతను చాటారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీధర్ మాట్లాడుతూ, ఇఫ్తార్ అనేది సమానత్వానికి ప్రతీక అని, మహమ్మద్ ప్రవక్త అన్ని మతాలు, కులాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారని తెలిపారు.
సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గడ్డం అంజిరెడ్డి, సభ్యులు ఎండి షఫీ, ఎట్టయ్య గౌడ్, అశోక్ గౌడ్, ఎండి ఇస్మాయేల్, ఎండి మహబూబ్, సద్దాం, కర్రోల నర్సింగ్ రావు, ధనరాజ్, కన్నా, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.




