10 July, 2026 | 7:39 PM

Breaking News

నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •   బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం   •   అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత   •   ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.. లేకుంటే ఉద్యమాలు ఉధృతం: ఏఐఎస్ఎఫ్   •   గుల్పర్తిలో సిగ్నల్ వ్యాధులపై అవగాహన   •  

జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి

06-05-2026 01:19 AM

జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

తూప్రాన్, మే 5 : జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాల పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని తూప్రాన్ పట్టణంలోని మమత ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రధానంగా కరీంనగర్ జువెలరీ షాప్ లో జరిగిన చోరీ కేసు విషయంలో తూప్రాన్ పట్టణ కేంద్రంలోని ప్రధాన బ్యాంకు అధికారులు, జెవెలరీ షాప్ యజమానులు పాన్ బోకర్స్ ఈ కార్యక్రమానికి పిలిచి జిల్లా అదనపు ఎస్పీ అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రతి బ్యాంకు అధికారులు పటిష్టంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అంతేకాదు ముఖ్యంగా ప్రతి సీసీ కెమెరా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా సీసీ కెమెరాలను పవర్ ఆఫ్ లో ఉంచరాదని సూచించారు. స్టోరేజీ బంగారం, వెండి నగలను ఐసోలేషన్ లో నిలువ చేసుకోవాలన్నారు, మరి ముఖ్యంగా రాత్రుల్లో జూవలరి షాప్ ముందు బ్యాంకుల ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

అంతే కాకుండా జ్యువలరీ యాజమాన్యం అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేసు కోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ పరిధిలో ఉన్న అపరిచితుల వ్యక్తులు మాకేం పట్టి అని అనకుండా ప్రమాదం జరిగిన వ్యక్తిని తక్షణమే సమీప దవఖానాలో చేర్పించాలన్నారు ఈ విషయంలో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని ప్రమాదం జరిగిన వ్యక్తులను అపరిచితులు కాపాడినట్లయితే వారికి ప్రభుత్వం నుండి 25 వేల పారితోషికం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి, సిఐ, రామాయంపేట సిఐ, నర్సాపూర్ సిఐ, తూప్రాన్, మనోహరాబాద్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.