6 May, 2026 | 2:37 AM

చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

06-05-2026 01:20 AM

మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్

గుమ్మడిదల, మే 5: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ కోరారు.

గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం, గుమ్మడిదల గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను, చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ముఖ్యంగా తూకం వేయడంలో జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చిమ్ముల సంధ్యారెడ్డి, తహసిల్దార్ పరమేశం, కమిషనర్ దశరథ్,మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు,ఎంపీడీవో ఉమాదేవి వార్డు కౌన్సిలర్లు సోనీ రెడ్డి, పద్మ, విజయ లక్ష్మి, రాజశేఖర్, నరేందర్ రెడ్డి, మురళి, చక్రపాణి, రమేష్, కుమార్ గౌడ్, సంజీవరెడ్డి, రైతులు మరియు వివిధ పార్టీల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.