25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా
22-03-2026 04:52 PM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనంటూ జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు టీ.జీవన్ రెడ్డి ఆదివారం లేఖ రాశారు. గత 20 నెలలుగా పార్టీలో మానసిక క్షోభకు, అవమానాలకు గురవుతూ కొనసాగులేని పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్ రాజీనామా చేస్తా అని జీవన్ రెడ్డి తెలిపారు.




