బావుసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ
కోనరావుపేట జూన్ 17 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని,బావుసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా, ఉపసర్పంచ్ తిక్కల నవీన్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీధర్, రవి తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసి, వాటిని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
విద్యార్థులు విద్యలో రాణించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నందున ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం గ్రామ ప్రజలందరి బాధ్యత అని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి విద్యాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.






