పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన మండల విద్యాశాఖ అధికారి
17-06-2026 03:20 PM
నిజాంసాగర్ జూన్ 17( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోగల ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్, నాయకులు సంకు సాయిలు, రవీందర్, సంకు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






