ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య
మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్
హుజూర్ నగర్,జూన్ 17: ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని హుజూర్ నగర్ మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ తెలిపారు.బుధవారం మండలపరిధిలోని అంజలిపురం గ్రామంలో 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జీరో ఎన్రోల్మెంట్ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ గోలి శ్రీనివాస్,కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పెనుగొండ శ్రీనివాస్ తో ఆయన కలిసి ప్రారంభించి మాట్లాడారు.
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలను చేర్పించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. నేడు పాఠశాలను తెరుచుటకు కృషిచేసిన గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గానికి,గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామసర్పంచ్ గోలి శ్రీనివాస్ మాట్లాడుతూ...గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని తెలిపారు.విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందు నాయక్, సి ఆర్పి సైదులు,వార్డు మెంబర్స్ పట్టేటి సునీత,ఎర్రం సీత,ఆవుల దొడ్డి గంగ నరసింహారావు,కార్యదర్శి సైదులు, తదితరులు,పాల్గొన్నారు.






