17 June, 2026 | 4:42 PM

Breaking News

పవర్‌గూడలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

17-06-2026 03:23 PM

జైనూర్, జూన్ 17(విజయ క్రాంతి):  కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్‌గూడ గ్రామపంచాయతీలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం సర్పంచ్ తొడసం రాజేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి జైనూర్ విద్యుత్ శాఖ ఏఈ లచ్చన్నకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పవర్‌గూడ గ్రామపంచాయతీకి నూతనంగా మంజూరైన విద్యుత్ స్తంభాలను త్వరగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

అలాగే కాలేజీగూడ, కొత్త పవర్‌గూడ ప్రాంతాల్లో వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న విద్యుత్ వైర్లను సరిచేయాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు చెప్పారు.విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్బులు పగలు, రాత్రి నిరంతరం వెలుగుతున్నందున ఆన్-ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలపై ఏఈ లచ్చన్న సానుకూలంగా స్పందించి, విద్యుత్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.