7 May, 2026 | 5:45 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్   •   వైన్ షాప్ ల వద్ద ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు తీసుకోండి   •   రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు   •   మంద రాజయ్య కు ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు   •   ఇంటర్ బోర్డు విలీనంపై ప్రభుత్వం పునరాలోచించాలి   •   మాల్తుమ్మెద పిఏసిఎస్ చైర్మన్ దుందిగల్ నర్సింలుకు ఘన సన్మానం   •   సౌర విద్యుత్తును వినియోగించి పంటలను సాగు చేసుకోండి   •   ప్రజా ప్రభుత్వంలో పేదలకు సరైన న్యాయం   •   వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం   •   టీవీకే, సీపీఐ నేతల సమావేశం.. సీపీఐ ఆఫీస్ కు టీవీకే నేత   •  

జపాన్ ప్రధాని రాజీనామా

08-09-2025 01:10 AM
  1. అంతర్గత విభేదాలే కారణం 
  2. ఏడాది కూడా కొనసాగని ఇషీబా

టోక్యో, సెప్టెంబర్ 7: జపాన్ ప్రధాని షిగేరు ఇషీబా ప్రధాని పదవికి ఆదివారం రాజీనామా చేశారు. గత కొద్ది రోజుల నుంచి సొంత పార్టీ నేతలతో ఆయనకు అంతర్గత విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ కారణాలతోనే ఇషీబా రాజీనామా నిర్ణయం ప్రకటించారని అంతా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఇషీబా రాజీనామా ప్రకటన వెలువడింది.

అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) తరఫున ఎన్నికల్లో విజయం సాధించిన ఇషీబా అక్టోబర్‌లోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ సాధించలేకపోయింది. అంతే కాకుండా దిగువ సభలో కూడా మెజారిటీ కోల్పోయింది. ఈ పరిణామాలన్నీ ప్రధానిపై ఒత్తిడిని పెంచాయి. ప్రత్యామ్నాయ నేతను ఇంకా ఎన్నుకోలేదు.