8 March, 2026 | 7:49 AM

ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ జన ఔషధి కేంద్రాలు

08-03-2026 12:38 AM

ఎంపీ ఈటల రాజేందర్ 

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రు ల్లో కూడా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపినట్లు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. జన ఔషధి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పా టుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ఈ సబ్జెక్ట్‌లో పార్లమెంట్ స్టాం డింగ్ కమిటీ మెంబర్ అని చెప్పారు. ఆ కమిటీకి అనేక సూచనలు అందించినట్లు వివరించారు. ఈ మధ్య క్యాన్సర్ కేసుల సంఖ్య బాగా పెరిగిందని, క్యాన్సర్ మందులు కూడా ఈ జన ఔషధి కేంద్రాల్లో ఉండాలని ప్రధాని మోడీ సంకల్పించారని గుర్తు చేశారు.   

పేదవారికి వైద్యం అందించాలనే దానికంటే.., పేరు ఎవరికి వస్తుందోననే పిచ్చి ఆలోచనతో కేంద్రం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథ కాన్ని రాష్ట్ర ప్రభు త్వం అమలుచేయడం లేదన్నా రు. కేంద్రం అందిస్తున్న వైద్య స్కీ ములు.., రాష్ట్రం అందిస్తున్న వైద్య స్కీములు సమన్వయం చేసుకొని పేదలకు అందిస్తే ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. నగరంలోని ఐడీపీఎల్‌లో ట్యాబ్లెట్ల తయారీ మొదలుపెట్టి దక్షిణ భారతదేశానికి మొత్తానికి ఇక్కడి నుంచి మం దులు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వా న్ని కోరినట్లు ఈటల వివరించారు. తెలంగాణలో 18 వేల జన ఔషధి కేంద్రాలు ఉన్నా యని, వాటిని 36 వేలకు పెంచేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.