calender_icon.png 6 February, 2026 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపునకు దగ్గరలో వకీల్ సాబ్

06-02-2026 01:05:49 AM

హస్తగతం కానున్న మంథని మున్సిపల్ 5వ వార్డు

సర్వేలన్నీ ఆయనకే అనుకూలం 

బ్రహ్మరథం పడుతున్న ఓటరు మహాశయులు 

మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలపై ప్రచారం

మంథని ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మంథని పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు అధికార కాం గ్రెస్ పార్టీ ఖాతాలో పడనుంది. ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది ముస్కుల సయేందర్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్లడమే గాక దాదాపు గెలుపునకు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక సర్వేలన్నీ ఆయనకి అనుకూలంగా వస్తుండడంతో 5వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపు దా దాపు లాంఛన ప్రాయం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి శ్రీధర్ బాబు సుపరిపాలన ప్రచార అస్త్రంగా జనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రజలనుంచి కూడా ఆశీర్వాదాలు అందుకుంటున్నాడు.

విద్యావేత్త కావడంతో ఐదవ వార్డు ప్రజలు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. దీనిలో భాగం గా గురువారం 5వ వార్డులోని బోయినపేట లోని గొల్లగూడెం, గంగాపురి, కూచిరాజ్ పల్లి, శ్రీరామ్ నగర్ లో మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు.సంక్షేమ పథకాలు రాని వారికి ఎన్నికల అనంతరం అందిస్తామని హామీ ఇస్తున్నారు. మంథని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పై పజలకు వివరిస్తున్నారు. చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుల సహకారంతో అధిక నిధులు తీసుకు వచ్చి పెద్ద ఎత్తున 5వార్డును అభివృద్ధి చేస్తానని సయేందర్ రెడ్డి ప్రజలకు హామీ ఇస్తు న్నారు. సయేందర్ రెడ్డి కి ఆయ గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.