2 August, 2026 | 3:46 PM

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌

02-08-2026 02:33 PM

హైదరాబాద్: ఆదివారం ప్రారంభమైన ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో( Ujjaini Mahankali Temple) ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. శ్రీ మహంకాళి అమ్మవారికి రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.