calender_icon.png 17 February, 2026 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లాండ్‌ను వణికించిన ఇటలీ

17-02-2026 01:33:48 AM

అతికష్టంతో సూపర్ ఎంట్రీ

కోల్‌కత్తా, ఫిబ్రవరి 16: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం తృటిలో తప్పిపోయింది. పసికూన ఇటలీ ఇంగ్లాండ్ జట్టుకు వణుకు పుట్టించింది. అది కూడా 200కు పైగా టార్గెట్‌ను దాదాపుగా ఛేదించినంత పని చేసింది. ఒక దశలో ఇటలీ ప్లేయర్ బెన్ మానెంటి విధ్వంసానికి ఇంగ్లాండ్‌కు గుండె ఆగినంత పనైంది. కాస్త అనుభవంతో చివర్లో ఓటమి నుంచి గట్టెక్కింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 202 పరుగుల భారీస్కోరు చేసింది. ఒక దశలో 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటకీ...టామ్ బాంటన్, విల్ జాక్స్ మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ భారీస్కోరు చేసింది. 

ఛేజింగ్‌లో ఇటలీ కేవలం 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఆంథోని(0) , స్మట్స్ (0) డకౌటవగా.. కెప్టెన్ మానెట్టి 12 పరుగులకే వెనుదిరిగాడు.ఈ పరిస్థితుల్లో బెన్ మానెంటి, గ్రాంట్ స్టివర్ట్ జట్టును ఆదుకున్నారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 48 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. ముఖ్యంగా మానెంటి విధ్వంసం ఓ రేంజ్‌లో సాగింది. భారీ సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లవు ఊచకోత కోశాడు.  ఇంకో రెండు ఓవర్లు అతను క్రీజులో ఉండుంటే ఇంగ్లాండ్‌కు ఖచ్చితంగా భారీ షాక్ తగిలేది. మానెంటి 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అటు స్టివర్ట్ 45 పరుగులు చేశాడు. చివర్లో స్టివర్ట్ , జస్ప్రీత్ సింగ్ వెంటవెంటనే ఔటవడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది.