calender_icon.png 17 February, 2026 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 నుంచి హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్

17-02-2026 01:32:13 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 16 : తెలంగాణలో గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేస్తున్న టీ గోల్ఫ్ ఫౌండేషన్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలీలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌తో కలిసి అమెచ్యూర్ గోల్ఫ్ క్రీడాకారుల కోసం హైదరాబా ద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తోంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ వేదికగా జరుగుతుంది. దీనికి సంబంధించి జెర్సీని నిర్వాహకులు ఆవిష్కరించారు.

దేశవ్యాప్తం గా ఉన్న అమెచ్యూర్ గోల్ఫర్లందరికీ ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని టీ గోల్ఫ్ ఫౌం డర్ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఓపెన్ అమెచ్యూర్ గోల్ఫ్‌లో ఒక చారిత్రక మైలురాయిగా పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్ ఇండియా సీఎఫ్‌ఓ , బిజినెస్ హెడ్ శ్రీ మధుసూదన్ రావు, హెచ్.ఐ.సీ.సీ. నోవోటెల్ జనరల్ మేనేజర్ శ్రీ రూబిన్ చెరియన్ ,

జాగిల్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీ డా. రాజ్ పి నారాయ ణం, మైండ్ స్పేన్ కమర్షియల్ లీజింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి, క్లైంట్ అసోసియేట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ చత్రధర్ పరిటాల, ఎర్త్ ఫుల్ కో ఫౌండర్ శ్రీ వేద గోగినేని, గోల్ఫ్ ట్రిప్జ్ కో ఫౌండర్ శ్రీ అజిత్ మోహన్ దాస్ , టీ గోల్ఫ్ అలియన్స్ , టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీ పాపిరెడ్డి పాల్గొన్నారు.