1 August, 2026 | 4:45 PM

జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా

01-08-2026 03:57 PM

జనగామ,(విజయక్రాంతి): శనివారం హైకోర్టు, అడ్మినిస్ట్రేషన్, జనగామ జిల్లా పోర్ట్‌ ఫోలియో జడ్జీ సురేపల్లి నందా జిల్లాకు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిర్వహించిన గౌరవ వందనాన్ని హైకోర్టు జడ్జీ స్వీకరించారు. ఈ నేపథ్యంలో పోలీసు కమిషనర్ (సీపీ) శ్వేత, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మర్యాదపూర్వకంగా హైకోర్టు జడ్జీని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో న్యాయ శాఖ, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.