తల్లిపాల వారోత్సవాలు
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కానుముల వెంకటేష్ మాట్లాడుతూ, శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని అన్నారు. పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించడం ద్వారా పోషకాహార లోపాలను నివారించడంతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు బాలామృతం, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య సిబ్బంది పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి, గ్రామ కార్యదర్శి వేల్పుల సురేష్, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.






