అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అండగా TWJF
- వర్కింగ్ జర్నలిస్టుల ప్రాథమిక హక్కు అక్రిడిటేషన్ కార్డ్..
- ఫెడరేషన్ సహకారంతోనే అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఫ్రీ లాన్స్ అక్రిడిటేషన్ కార్డులు..
- జర్నలిస్టులకు ఫ్రీ లాన్స్ అక్రిడిటేషన్ కార్డుల అందజేత..
- టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖదీర్...
ఖమ్మం: సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఎల్లప్పుడూ...తమ యూనియన్ TWJF అండగా ఉంటుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ అన్నారు. శనివారం ఖమ్మంలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులకు అర్హత ఉన్నప్పటికీ వారు అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడంలోనూ ఆన్లైన్ ఇతర అంశాలలో వారికి అవగాహన కల్పించి, అర్హత ఉన్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అండగా ఉంటూ శనివారం ఫ్రీ
లాన్స్ అక్రిడిటేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయగా వాటిని టి డబ్ల్యూ జె ఎఫ్ ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కొరకొప్పుల రాంబాబు, యూనియన్ జిల్లా నాయకులు కృష్ణమాచార్యులకు ఫ్రీ లాన్స్ అక్రిడేషన్ కార్డులను అందజేసి మాట్లాడారు.. వివిధ పత్రికలలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డు వారి ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు. తమ యూనియన్ ఫెడరేషన్ సహకారంతోనే అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఫ్రీ లాన్స్ అక్రిడిటేషన్ కార్డులు దక్కాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ జానిపాషా, లక్ష్మారెడ్డి, చౌదరి తదితరులు పాల్గొన్నారు..






