1 August, 2026 | 4:37 PM

రాజంపేటలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆత్రం సుగుణక్క

01-08-2026 03:51 PM

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలం రాజంపేట గ్రామపంచాయతీలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క శనివారం పరిశీలించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాలకు దూరంగా ఉపాధి, ఉద్యోగాలు, విద్య తదితర కారణాలతో ఉన్న వారి వివరాలను సేకరించి, వారికి సమాచారం అందించి పేర్లు నమోదు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, మండల కోఆర్డినేటర్లు, బీఎల్‌వోలు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆమె కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, వార్డు సభ్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు గులాం జావిద్, సిడం తిరుపతి, రాము, బీఎల్‌ఏలు, ఎస్‌ఐఆర్ మండల కోఆర్డినేటర్లు, బీఎల్‌వోలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.