2 April, 2026 | 3:54 AM

నిర్దేశిత ప్రణాళిక ప్రకారం సాగాలి

02-04-2026 12:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, ఏప్రిల్ (విజయక్రాంతి) : జిల్లాలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ గ్రామ సభల్లో భాగంగా, ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

వివిధ పథకాల రూపాలలో లబ్ధి పొందిన వారి వివరాలు వెల్లడించాలని చెప్పారు. గ్రామ సభలకు హాజరయ్యే వారికి అవసరమగు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున నిర్ణీత సమయంలో గ్రామ సభలను ముగించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిపిఓ జీవరత్నం, డిపివో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో గోవింద్, మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.