10 June, 2026 | 3:52 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

మంత్రి పదవి ఆశించింది నిజమే

06-11-2025 02:05 AM
  1. కొన్ని సమీకరణాల వల్ల రాలేదు 
  2. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి  
  3. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): నేను మంత్రిపదవి ఆశించిన మాట వాస్తవమే..కానీ, కొన్ని సమీకరణాల వల్ల మంత్రి పదవి రాలేదు’ అని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. తనకు కేటాయించిన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి తదితరులు హాజరై అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సుదర్శ న్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానన్నారు. ఈ బాధ్యతలు అప్పగించిన సోనియాగాంధీ, రాహు ల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అభివృద్ది జరగలేదని, గత ప్రభుత్వం హయాంలో పనికిరాని పథకాల వల్ల ప్రజలపై భారం మోపారని ఆయన విమర్శించారు. తాను గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పథకాల అమలు కోసం రూ.7వేల కోట్ల వర కు ఖర్చు చేశామని, ఉన్న వాటిని అమలు చేసేందుకు ప్రణాళికలు చేస్తామని చెప్పారు.