19 March, 2026 | 8:47 PM

అలాంటి వ్యక్తి వైదొలగడం దేశానికి మంచిదే!

19-03-2026 12:00 AM

కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామాపై ట్రంప్ వ్యాఖ్యలు

వాషింగ్టన్, మార్చి 18: ‘అతడొక బలహీనుడు, యుద్ధ వ్యూహాల విషయంలో పనికి రాడు! అలాంటి వ్యక్తి వైదొలగడం దేశానికి మంచిదే!” అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తన ప్రభుత్వంలో అత్యంత కీలకమైన కౌంటర్ టెర్రరిజం చీఫ్ జో కెంట్ రాజీనామాపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.  యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న దూకుడు విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జో కెంట్ తన పదవికి రాజీనామా సమర్పించారు.

ఇరాన్‌పైదాడులు, ఆ దాడుల్లో అమాయక పౌరుల మరణాలు, ప్రాంతీయ అస్థిరత వంటి అంశాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ వర్గాల కథనం. వ్యూహాత్మక విభేదాలు తారస్థాయికి చేరడంతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకు న్నారని తెలుస్తోంది. ఒక కీలక అధికారి రాజీనామాపై సంయమనం పాటించాల్సింది పోయి, ట్రంప్ విరుచుకుపడ్డారు.