24 May, 2026 | 8:37 PM

నష్టపరిహరాన్ని సుప్రీం కోర్టు పరిశీలించడం అభినందనీయం

30-10-2025 01:45 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : చేయని నేరానికి శిక్షకు గురైతే బాధితులకు నష్టపరిహరం చెల్లించే అంశా న్ని సుప్రీం కోర్టు పరిశీలించడం అభినందనీయమని తె లంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజాసామ్య సంక్షే మ రాజ్యమైన భారత దేశం లో వ్యక్తికి జీవించే ప్రాథమిక హక్కును మన భారత రాజ్యం గం కల్పించిందని పేర్కొన్నా రు.

ఈ మేరకు బుధవారం  కవాడిగూడ జేఏసీ కార్యాలయంలో ఆయ న మాట్లాడుతూ దేశంలో పౌరులకు ఎప్పుడైనా నష్టం, కష్టం, బాధలు,  అగౌరవాలు  కల్గినప్పుడు, నష్టాన్ని తీర్చుకునే, నష్ట పరిహారాలను  పొందేందుకు  రాజ్యంగం కల్పించిన వృవస్థలున్నాయని గుర్తు చేశారు.