7 March, 2026 | 1:43 PM

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

07-03-2026 12:37 AM
  1. ఐదుగురు మృతి, ఏడుగురికి గాయాలు
  2. ప్రకటించిన లెబనాన్ ఆరోగ్య మంత్రి 
  3. సురక్షిత ప్రాంతాలకు తరలిన ప్రజలు

బిరుట్, మార్చి 6 : పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు ఉద్రిక్తలు ముదురుతున్నాయి. బీరూట్‌తోపాటు అనేక ప్రాంతాల్లో హిజ్‌బొల్లా సైనిక స్థావరాలపై అనేక వైమానిక దాడులు నిర్వహించింది. లెబనాన్‌లోని దక్షిణ భాగంలోని మార్వానీ, యహ్మర్ అల్-షకీఫ్తో సహా అనేక పట్టణాలను ఇజ్రాయెల్ వైమానిక దాడులు తాకాయి. లెబనాన్‌లోని సిడ్‌పై దాడి చేసింది.

ఈ దాడిలో ఐదుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి పేర్కొన్నట్లు సమాచారం. లెబనాన్‌లోని బెకా లోయలో ఇజ్రాయెల్ ప్రజలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించింది. నివాసితులందరూ త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని కోరింది. ఇజ్రాయెల్ సైన్యం నబీ చిట్, ఖాదర్, సరైన్ అల్-ఫవ్కా, సరైన్ అల్-తహ్తాతో సహా అనేక ప్రదేశాల్లో దాడులు చేసేందుకు యత్నిస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.