30 May, 2026 | 2:45 AM

ఈషా సరికొత్త చరిత్ర

30-05-2026 01:20 AM

10 మీ. ఎయిర్ పిస్టల్‌లో రజతం

ప్రపంచకప్‌లో రెండు మెడల్స్

మ్యూనిచ్, మే 29 ఃఐఎస్‌ఎస్‌ఎఫ్ షూ టింగ్ ప్రపంచకప్ లో హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్ తన ఫామ్ కొనసాగిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెం ట్ లో స్వర్ణం గెలిచిన ఈషా తాజాగా మరో పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రజతా న్ని గెలుచుకుంది. ఫైనల్స్‌లో 241.2 పా యింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

25 మీ. పిస్టల్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈషా సింగ్ ఇప్పుడు మరో మెడల్ గెలిచి టోర్నీలో రెండు పతకాలు గెలుచుకు న్న ఏకైక షూటర్‌గా ఘనత సాధించింది. కాగా ఇదే ఈవెంట్‌లో మరో భారత షూట ర్ సురుచి స్వర్ణం కైవసం చేసుకుంది. ఆమె 242.1 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

కొరియాకు చెందిన చూ గియాన్ 220.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలి చి కాంస్యాన్ని అందుకుంది. కాగా ఇప్పటి వరకూ ఈ పోటీల్లో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతంతో సహా మూడు పతకాలు సా ధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. నార్వే 2 స్వర్ణాలతో రెండో స్థానంలోనూ, కొరియా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడో స్థానంలోనూ, చైనా (2 పతకాలు) నాలుగో స్థానంలోనూ, సెర్బియా ఐదో స్థా నంలోనూ ఉన్నాయి.