18 March, 2026 | 8:15 AM

మున్సిపల్, విద్యా శాఖల్లో అవినీతి వెనుక సీఎం హస్తం ఉందా?

18-03-2026 12:00 AM

బీజేపీ నేత కోలన్ శంకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు

బడంగ్‌పేట్, మార్చి 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్, విద్యా శాఖల్లోనే అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని బీజేపీ రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి ధ్వజ మెత్తారు. మంగళవారం గాయిత్రి నగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చేరిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమున్సిపల్, విద్యా శాఖల బాధ్యతలు సీఎం వద్దే ఉన్నాయని, అధికారుల అవినీతి ఆయనకు తెలిసే జరుగుతోందా లేక ఆయన ప్రోత్సాహంతోనే సాగుతోందా అని శంకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల వివిధ మున్సిపాలిటీల్లో అధికారులు ఏసీబీకి చిక్కడం రాష్ట్రం లో పెచ్చుమీరిన అవినీతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డికిని జాయితీ ఉంటే, ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గౌరీ శంకర్, బీజేపీ నాయకులు గడ్డం జగన్, సురేష్, కాశీరాం యాదవ్, జగన్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.