2 April, 2026 | 9:37 AM

పంతం.. మీద మాదా

02-04-2026 12:00 AM
  1. ఖానాపూర్ పురపీఠం దక్కేది ఎవరికి 
  2.  4 న ఎన్నికకు ఆదేశం 
  3. ఏర్పాట్లపై దృష్టి పెట్టిన అధికారులు 

ఖానాపూర్ ఏప్రిల్ 1(విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పై అందరి దృష్టి పడింది. ఇప్పటికీ రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడగా ఈనెల 4న తిరిగి ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదరపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రత్యేక అధికారి జీవరత్నం దృష్టి పెట్టారు.

ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా 13న ఫలితాలు వెలుపడ్డాయి.16 న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా ఏ పార్టీకి మెజార్టీ లేకపోవడంతో పొత్తులు కుదరక ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత రెండు సార్లు ఎన్నిక నిర్వహించిన బిజెపి కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో వాయిదా పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నిక జరగలేదు.

దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో ఈనెల 4న ఎన్నిక నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈనెల 4న జరగనున్న నేపథ్యంలో చైర్మన్ వైస్ చైర్మన్ మీద మాదా అనే రీతిలో బిజెపి కాంగ్రెస్ టిఆర్‌ఎస్ అనే రీతిలో క్యాంపెను నిర్వహిస్తున్నాయి.

ఈ మున్సిపాలిలో మొత్తం 12 వార్డులు ఉండగా ఎన్నికల్లో కాంగ్రెస్ నలుగురు, బిజెపికి నలుగురు, టిఆర్‌ఎస్ కు నలుగురు కౌన్సిల్ సభ్యులు సమానంగా ఉండడంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పై తీవ్రపుత్కంఠత నెలకొంది. ఈ ఎన్నిక ను స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేడమ బుజ్జి పటేల్, భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్, బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఎవరికి వారే చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల కోసం పోటీ పడడంతో మూడు పార్టీల మధ్య సయోధ్యకుదురుగా ఎన్నిక వాయిదా పడుతూ వస్తుంది.

ఇప్పటికి బిజెపి, టిఆర్‌ఎస్ కు ఒప్పందానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్న అది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక దాకా ఏం జరుగుతుందో ఆందోళన నెలకొంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు రెండు పార్టీలు రెండున్నర సంవత్సరాల చొప్పున పదవుల పంపకానికి అంగీకారానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే అటువంటి ఒప్పందంపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాలుగు కౌన్సిలర్ స్థానాలు ఉండగా బిజెపి బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ వైస్ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

బిజెపి బిఆర్‌ఎస్ లో చీలిక తెచ్చేందుకు మంతనాలు చేస్తున్నట్టు రాజకీయ నాయకులు చెప్తున్నారు. అయితే టీఆర్‌ఎస్ బిజెపి మధ్య పొత్తు చెడిపోకుండా తమ సభ్యులు చేజారి పోకుండా రెండు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఒకవేళ ఆ రెండు పార్టీలు ఏకమైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమయ్యే ఏడు మెజార్టీ కౌన్సిలర్ల సంఖ్య సరిపోవటంతో ఎన్నిక లాంఛనంగా పూర్తి కానుంది. ముందుగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంకా స్పష్టత లేదు.

దీంతో దాన్ని అవకాశంగా తీసుకుని ఆ సభ్యులను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ వైపు వస్తారన్న ఆశ ఆ నేతలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఈనెల 4న జరగనున్న మున్సిపల్ ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మక కావడంతో అక్కడ జరుగుతున్న పరిణామాలు మూడు పార్టీలకు పట్టిస్తున్నాయి 

ఎన్నికలకు ఏర్పాట్లు ..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభిం చారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రత్యేక అధికారి జీవరత్నం ఆధ్వర్యంలో ఎన్నికను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం ఎన్నికలు నిర్వహించి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఎన్నిక ఈనెల 4న పూర్తి అవుతుందా లేదా వాయిదా పడుతుందా వేచి చూడాల్సిందే