4 March, 2026 | 1:34 AM

అక్రమ నిర్మాణాలకు అడ్డా.. పాల్వంచ?

04-03-2026 12:00 AM
  1. పాల్వంచ పట్టణం అక్రమ నిర్మాణాల కేంద్రం 

అధికారుల తీరుపై పలు  అనుమానాలు? 

ఇప్పటి ముప్పడిగా భవన నిర్మాణాలు 

కోర్టును సైతం తప్పు దోవ పట్టిస్తున్న అధికారులు? 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 3, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ ఆ క్రమ నిర్మాణాల కేంద్రంగా విరాజుల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పట్టణ పరిధిలో ఇబ్బడి ముప్పడిగా భవనాల నిర్మాణం సాగుతున్న, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిన మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. నగర ప్రణాళిక, భవన అనుమతులు, లైసెన్స్ వంటి అంశాలు కేవలం కాగితాలకే పరిమితమయ్య అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిబంధనలను పక్కనపెట్టి నిర్మాణాలు సాగుతున్నాయని స్థానికులు లబోదిబోమని ఆరోపిస్తున్న, బాధితులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్న, అక్రమార్కుల నుంచి అందుతున్న ముడుపుల కారణంగా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే చర్చ బహిరంగంగానే వినిపించటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. పట్టణ పరిధిలోని బొల్లోరుగూడెం, ప్రశాంత్ కాలనీ, వెంగళరావు కాలనీ, ఒడ్డుగూడెం, కాంట్రాకట్స్ కాలనీలలో అనుమతి లేకుండా భవనాలు విచ్చలవిడిగా నిర్మిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు తెలిసిన తెలియనట్లు వ్యవహరించటం ఆరోపణ ద్రోపరుస్తున్నాయి. 

ఫంక్షన్ హాల్స్  వ్యవహారం మరింత అనుమానాస్పదం? 

సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం పట్టణంలో ఒక సుగుణ గార్డెన్ మినహాయించి ఏ ఫంక్షన్ హాలుకు అనుమతులు లేవని లిఖితపూర్వకంగా సమాధానం చెప్పిన విషయం విధితమే. సందుకొక ఫంక్షన్ హాలు, వీధికి మూడు ఫంక్షనహాళ్లు ఎలాంటి అనుమతులు లేకుండా శుభ ,అశుభ కార్యక్రమాలను నిర్వహిస్తున్న అధికారులు పట్టనట్టు వ్యవహరించటం శోచనీయం. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ కూత వేటుదూరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఫంక్షన్ హాల్ నిర్మాణంతో పాటు, వ్యాపార సముదాయాన్ని నిర్మించిన అట్టి అక్రమ నిర్మాణాలపై అధికారులు ధూతూ మంత్రంగా సీజ్ చేశామని కోర్టును తప్పుదోవ పట్టించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. కోర్టు ఆదేశిస్తే తప్ప ఆ ఫంక్షన్ హాల్ లో ఎలాంటి కార్యక్రమాల నిర్వహించరాదని చెప్పడం గమనారహం. రాష్ట్రవ్యాప్తంలో ఇతర మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జలుపించి నేలమట్టం చేస్తుంటే పాల్వంచ పరిధిలో మాత్రం ఉదాసీన వైఖరి అవలంబించటం లో అంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి. 

ప్రభుత్వ ఆదాయానికి గండి 

అనుమతులు లేని భవన నిర్మాణాలు, లైసెన్సులు లేని ఫంక్షన్ హాల్స్ కారణంగా ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి భారీగా గండి పడుతుంది. అధికారులకు మాత్రం భారీగా ముడుపులు అందుతున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఈ తీరు అద్దం పడుతోంది. ఇప్పటికైనా జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాలపై, అనుమతులు లేని ఫంక్షన్ హాల్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,

సమగ్ర సర్వే నిర్వహించి అనుమతులు లేని నిర్మాణాలు అక్రమ  కట్టడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అక్రమ నిర్మాణాలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాలుపై చర్యలు  తీసుకుంటాం 

పట్టణంలో అనుమతి లేకుండా భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు రూఢీ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పట్టణంలో బహుళ అంతస్తులు నిర్మాణాలకు సైతం అనుమతులు ఇస్తామని, టెక్నికల్ అప్రూవల్ మాత్రం ఆర్జెడి కార్యాలయం నుంచి రావాల్సి ఉంటుందన్నారు.

- నవీన్ కుమార్,టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్