4 May, 2026 | 2:24 AM

భీమేశ్వరస్వామి దర్శనానికి ప్రముఖుల రాక, ప్రత్యేక పూజలు

04-05-2026 01:10 AM

వేములవాడ, మే 3,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖులు స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు.శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

అనంతరం స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు.అదేవిధంగా, ఆర్మూరు శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు కూడా భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.తరువాత ఆలయం ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.