13 July, 2026 | 1:04 AM

కరువు తరుముకు వస్తుందా?

13-07-2026 12:02 AM

చెరువు నిండాలే..! అలుగు పారలే..! 

బోథ్ . జూలై 12 (విజయ క్రాంతి) బోత్ ప్రాంత రైతాంగాన్ని కరువు ఛాయలు వెంటాడుతాయేమోనన్న ఆందోళన నెలకొంది దీంతో రైతాంగం భవిష్యత్తు పైన ఆవేదన చెందుతున్నారు. వరుణుడి కరుణ లేక మొ లకెత్తిన పంట బ్రతుకుతుందా లేదా అనేది రైతుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి మరో ఐదు రోజులపాటు వర్షాలు కురవని వాతావరణ నిపుణులు పేర్కొంటుండడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు దిగాలు చెందుతున్నారు.

నిండని చెరువులు పెరగని భూగర్భ జలం... 

వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు మండలంలో భూగర్భ జలాలు పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.మరోవైపు చెరువులు నిండక పోవడం వల్ల సాగునీరు అందుతుందో లేదోనని ఆవేదన చెందుతున్నారు .గత ఏడాది ఈపాటికి కరత్వాడ చెరువు నుండి అడుగు పైనుండి నీరు పారింది.అయితే ఈ ఏడాది అనుగుకు 500 మీటర్ల దూరంలో నీరు ఉండడంతో సాగునీరు కష్టమేనని అంటున్నారు. భవిష్యత్తులో వర్షాలు కురిస్తే తప్ప సాగునీరు అందక రబీ సాగు గగనమేనని రై తులు కాబోతున్నారు. కరత్వాడ సమీపంలో ఉన్న చెరువు ఎడారిని తలపిస్తున్నది.

పూడిక తీయక.. 

కరత్వాడ చెరువు నిర్మించి రెండు దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటివరకు పూడిక తీయకపోవడంతో చెరువులో నీటి నిలువ సామర్థ్యం పూర్తిస్థాయిలో తగ్గిపోతున్నది. వేసవి కాలమైన రైతులు చెరువులోని మట్టిని తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వ పరంగా అనుమతులు ఇస్తే ఈ ప్రాంత రైతాంగం చెరువు మట్టిని తమ పంట పొలాలలోకి తీసుకువెళ్లి ఎరువుగా వాడుకునే అవకాశం ఉంది. ప్రభు త్వం ఈ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.