20 August, 2026 | 3:37 AM

ఇరుముడి ట్రెండ్ సెట్టర్ సినిమా!

20-08-2026 01:22 AM

మాస్ మహారాజా రవితేజ నుంచి తాజాచిత్రం ‘ఇరుముడి’. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ కాగా, బేబి నక్షత్ర కీలక పాత్రలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తెలిపిన సినిమా విశేషాలివీ.. “-నేను ప్రేమకథలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశా. ‘ఇరుముడి’ మాత్రం చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ కథ చెప్పినప్పుడే నేను అందులో లీనమైపోయా.

తెలుగు సినిమాకు ‘ఇరుముడి’ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. ఈ సినిమాకు పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది చాలా మంచి సినిమా అవుతుం ది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. మేము మా బెస్ట్ ఇచ్చాం. ఈ సినిమాకు బెస్ట్ రీజినల్ ఫిలిం, బెస్ట్ చైల్ ఆర్టిస్ట్.. ఇలా చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయని నేను ఆశిస్తున్నా. అలాగే కమర్షియల్‌గా కూడా సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా.

ఈ సినిమా మ్యూజిక్ నాకు చాలా ప్రత్యేకం. ఇందులో ప్రతిదీ సైకలాజికల్‌గా ఉంటుంది. అందుకే నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఇంటెన్స్ సైకలాజికల్ థింకింగ్‌తో అప్రోచ్ అయ్యా. ‘ఓంకార’ అనే ఒక సినిమా మ్యూజిక్‌కు చాలా సైకలాజికల్ అప్రోచ్ ఉంటుంది. నేను ‘ఇరుముడి’ స్కోర్‌కు కూడా అలాగే ట్రీట్ చేశా. మూడు లేయర్స్‌లో ప్రభావవంతమైన సంగీతం రూపొందించడం చాలా సవాలుతో కూడుకున్న పని. ‘ఇరుముడి’లో అలాంటి మ్యాజిక్ కుదిరింది.

భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్నింటినీ మ్యూజికల్‌గా బ్యాలెన్స్ చేశాం. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా ఛాలెంజింగ్. ఇది చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. ప్రేక్షకులు ఈ సినిమాను మర్చిపోలేరు. తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ అవుతుంది” అని తెలిపారు.