4 July, 2026 | 8:53 PM

Breaking News

సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •  

ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ సందడి— టీమ్‌లోకి ధోని.. సీఎస్‌కేకు మరింత క్రేజ్

18-04-2026 06:15 PM

హైదరాబాద్: ఉప్పల్ మైదానంలో(Uppal Stadium) ఐపీఎల్ మ్యాచ్ సందడి నెలకొంది. రాత్రి 7.30 గంటల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్(Chennai Super Kings vs Sunrisers Hyderabad Match) ప్రారంభం కానుంది. స్టేడియంలో చెన్నై, హైదరాబాద్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఎంఎస్ ధోని జట్టులో చేరడంతో సీఎస్‌కేకు మరింత క్రేజ్ పెరిగింది. 


సన్‌రైజర్స్ హోంగ్రౌండ్‌ వేదికగా ఒక మ్యాచ్‌లో ఓడి.. మరో మ్యాచ్‌లో గెలిచింది. ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు. ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ లో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం వద్ద 430 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. మ్యాచ్ కు వచ్చే వారి కోసం 11 పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి ల్యాప్ ట్యాప్ లు, బ్యాగులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు నిషేధించారు. ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా శనివారం అర్ధరాత్రి వరకు మెట్రోరైలు సర్వీసులు అందుబాటులో ఉంచారు.