అంతర్జాతీయ యోగా వేడుకలకు ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఆహ్వానం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు శుక్రవారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును వాకర్సు సభ్యులు ఆహ్వానించారు. అలాగే వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వాకర్స్ సభ్యులు ప్రతిరోజూ గ్రౌండ్‌లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా గ్రౌండ్‌లో ఉన్న జిమ్ పరికరాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాకర్స్, యువత వ్యాయామం చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. జిమ్‌ను మరమ్మతులు చేయించి ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వందలాది మంది ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అలాగే వాకర్స్‌కు అవసరమైన మౌలిక వసతుల కల్పన, గ్రౌండ్ పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, లైటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా ఎమ్మెల్యే కు వినతిపత్రం సమర్పించారు. సభ్యుల సమస్యలను ఎమ్మెల్యే విజయ రమణారావు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు సానుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వాకర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు ఎమ్మెల్యే సన్మానం చేయడం జరిగింది.






