4 May, 2026 | 5:00 PM

మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం

04-05-2026 03:42 PM

 హైదరాబాద్ లో మంత్రికి  అందజేసిన అడవి శ్రీరాంపూర్ గౌడ సంఘ నాయకులు

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ జమదగ్ని ముని సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన మే 9వ తేదీన  శనివారం  జరుపబడునని,  ఈ  కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు  కు  హైదరాబాదులోని మంత్రి  నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేసి ప్రతిష్టాపనకు రావలసిందిగా గౌడ కులస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తో పాటు గౌడ సంఘం నాయకులు కూనూరి సత్యనారాయణ గౌడ్, గట్టు సదయ్య గౌడ్, వీరగోని సంతోష్ గౌడ్, బండి క్రాంతి కుమార్ గౌడ్, వార్డు సభ్యులు వీరగోని అంజి గౌడ్, అడవి శ్రీరాంపూర్ గౌడ, సంఘం తరఫున ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో సెంట్రల్ లైటు మంత్రి మంజూరు చేశారు. అడవి శ్రీరాంపూర్ గ్రామ గౌడ సంఘం తరఫున  మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.