తెలంగాణలోనూ ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఖాయం
ముకరంపుర,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రం లోకూడా భారతీయ జనతా పార్టీ పాగా వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో బీజేపి పార్టీ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి కార్పొరేటర్లు, బీజేపి శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేశారు.
ఈ సందర్భంగా బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన రెండు రాష్ట్రాల నాయకులకు ప్రజలు, మహిళలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో గతంలో 2 సీట్లు ఉన్న బీజేపీ నేడు 200 సీట్ల స్థాయికి ఎదగడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






