హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత
26-06-2026 06:05 PM
నంగునూరు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని భక్తంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన పత్రికను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు ఆలయ కమిటీ ప్రతినిధులు అందజేశారు.శుక్రవారం కోకపేటలోని ఆయన నివాసంలో హరీష్ రావును కలిసి ఆలయ కార్యక్రమాలకు రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సనాధుల బాలపోచయ్య, ఉప సర్పంచ్ కోల శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చౌడుచెర్ల జయపాల్ రెడ్డి, నల్ల పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కోల మహేందర్ గౌడ్, గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






