26 June, 2026 | 8:34 PM

అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలి

26-06-2026 07:16 PM

బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి, జూన్ 26 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ.శైలజ అన్నారు. శుక్రవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివేషన్) ఎస్ ఐ ఆర్ లో భాగంగా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలను ఎన్నికల ఇన్‌చార్జ్ మోహన్‌రావుతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా బూత్‌లను పరిశీలించి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమీక్షించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు (బి ఎల్ ఓ లు) ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.