1 July, 2026 | 7:11 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ

01-07-2026 06:14 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన కాటిపల్లి రాజిరెడ్డి జనసేన ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూర్ మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు రెండో విడత డ్యుయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమల్లారెడ్డి గ్రామానికి 74, కంచర్లకు 30, ఇసన్నపల్లికి 35, బస్వాపూర్‌కు 65 డ్యుయల్ డెస్క్ బెంచీలు అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. విద్యార్థులు నేలపై కాకుండా బెంచీలపై కూర్చొని సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా డ్యుయల్ డెస్క్‌లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ట్రస్ట్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.