ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధూప దీప నైవేద్య పథకంలో కొనసాగుతున్న అర్చకుల నూతన రాష్ట్ర సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో ఘనంగా నిర్వహించారు.
ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శేషం శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ తనను రెండోసారి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంఘం నాయకులకు, సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అర్చకుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం సంఘం మరింత బలంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అర్చకుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






