1 July, 2026 | 7:34 PM

Breaking News

డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •  

గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

01-07-2026 06:22 PM

గజ్వేల్: స్థానిక బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... మొదటి సంవత్సరానికి గాను ప్రభుత్వ కళాశాలలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు  శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.