27 August, 2026 | 3:30 AM

పెట్టుబడులను ఆకర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ

27-08-2026 02:29 AM
  1. నిపుణులతో కమిటీల ఏర్పాటు
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి) : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) -ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణ(organization of the Invest Telangana Summit)లో భాగంగా ప్రజాభవన్‌లో తక్షణమే ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం అతిథులకు ఆహ్వాన పత్రాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పంపించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బుధవారం ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమా వేశమైంది.

ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో ఈ వార్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలను సీఎస్ పటిష్టం చేయాలని సూచించారు. సమ్మిట్ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలలో అవసరమైన నిపుణులను కీలక అధికారులను తీసుకోవాలని ఆయన చెప్పారు.

గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల ప్రస్తుత పురోగతిపై సమగ్ర విశ్లేషణ చేసేందుకు ప్రత్యేకంగా కమిటీకి బాధ్యతలు అప్పగించాలన్నారు. డిసెంబర్‌లో జరగనున్న సమ్మిట్ కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించి పెట్టుబడిదారులను ఆకర్షించాలని చెప్పారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం అతిథులకు ఆహ్వాన పత్రాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పంపించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమ్మిట్ పనుల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోజుకు కనీసం ఒక గంట కేటాయించి రోజువారీ సమీక్షలు నిర్వహించాలని, ప్రతి కమిటీకి కేటాయించిన బాధ్యతలను టైమ్లైన్ ప్రకారం పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.