3 July, 2026 | 11:16 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ వేడుకలు

04-05-2026 01:36 AM

ముషీరాబాద్, మే3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 80వ ఐఎన్టీయూసీ స్థాపన దినోత్సవ వేడుకలు ఆదివారం ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐఎల్‌ఓ సభ్యుడు జి.సత్యజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజేఈయూ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్ మాట్లాడుతూ  ప్రపంచవ్యాప్తంగా ఐఎన్టీయూసీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కనిపిస్తున్న చిత్తశుద్ధిని ప్రస్తావించారు.

ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం, కార్మికుల మధ్య సమన్వయం సాధించి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిన విధానాన్ని గుర్తు చేశారు. ఐఎన్టీ యూసీ నేషనల్ ప్రెసిడెంట్ జి. సంజీవ రెడ్డి నాయక త్వంలో  రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మొగుళ్ల రాజి రెడ్డి  నాయకత్వంలో ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్  మార్గదర్శకత్వంలో ఐ ఎన్టీ యూసీ బలంగా ముందుకు సాగుతోందన్నారు.

ముఖ్యంగా మొగుళ్ల రాజు రెడ్డి ఐఎన్టీ యూసీని వాటర్ బోర్డ్లో తీసుకువచ్చిన తర్వాత అనేక కార్మిక సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు.  అలాగే రాబోయే జల మండలి ఎన్నికల్లో త్రి శూలం గుర్తుకు ఓటు వేసి తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అదే చిత్తశుద్ధితో కార్మి కుల సమస్యలను పరిష్కరించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మొగుళ్ల రాజిరెడ్డి నాయ కత్వంలో త్వరలోనే మిగిలిన సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయన్నారు.  రాష్ట్రం లో ఐఎన్టీ యూసీ నాయక త్వం కార్మికుల సంక్షేమానికి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కార్యాక్రమంలో టీజే ఈయూ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. రాజా తదితరులు పాల్గొన్నారు.