calender_icon.png 21 February, 2026 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సంక్షేమానికి ఐఎన్టీయూసీ కృషి

21-02-2026 05:27:25 PM

ఐఎన్టీయూసీ నాయకులు తీగల క్రాంతి కుమార్ , కోటేశ్వరరావు

సత్తుపల్లి,(విజయక్రాంతి): స్థానిక సత్తుపల్లి పట్టణం సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో జేవీఆర్ ఓసి ఫిట్ సెక్రటరీ రామారావు ఆధ్వర్యంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు అధ్యక్షతన జే.వి.ఆర్ ఓసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ జాయింట్ జనరల్ సెక్రెటరీ తీగల క్రాంతికుమార్ పాల్గొన్నారు. సత్తుపల్లి జే.వి.ఆర్ ఓసి ఫిట్ కమిటీ మార్పు, ఇతర కమిటీలలో నాయకులకు అవకాశం, ఐఎన్టీయూసీ యూనియన్ బలోపేతం కోసం చర్చించారని తెలియజేశారు.

నాయకులు మాట్లాడుతూ... ఐఎన్టీయూసీ యూనియన్ కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని సింగరేణిలో ప్రాతినిధ్య సంఘంగా ఉన్నప్పటికీ జనక్ ప్రసాద్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో నూతన ఉద్యోగుల రిక్రూట్మెంట్, డిపెండెంట్ ల వయోపరిమితి పెంపు, ఉద్యోగులకు 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాఫిట్ బోనస్ ఇప్పించామని, ఉద్యోగుల సొంత ఇంటి కల, ఆదాయపన్ను రాయితీ ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతో చర్చించి త్వరలోనే కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు.

సింగరేణిలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఐఎన్టీయూసీ యూనియన్ సిద్ధంగా ఉందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణిలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ యూనియన్ గెలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు నాగ ప్రకాష్, సీతారామరాజు  నాయకులు సురేష్, శ్రీధర్,  పొట్టి కిరణ్, ఐ.వి.రెడ్డి, మురళీకృష్ణ, శ్రీనివాస్ రాము, తిరుమలరావు,  రామచందర్, రమేష్,  ఇక్బాల్, సుదర్శన్, రామారావు, శ్రీనివాస చారి, శ్రీనివాసరావు, అశోక్, సదానందం, సుదర్శన్, గణేష్, వెంకటేశ్వర్లు, షాట్రాక్ బాబు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.