కరువు నేల రాక్షసుడు!
విజయ్ దేవరకొండ, రష్మిక మం దన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి‘. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోందీ సినిమా. ఈ చిత్రంతో తొలిసారి ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘ది మమ్మీ’ మూవీ ఫేమ్ ఆర్నాల్ వోస్లూ. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీలోని అతని పాత్రను ‘సర్ థియోడోర్ హెక్టర్’గా పరిచయం చేశారు. ఈ మేరకు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో ‘కరువు నేల రాక్షసుడు సర్ థియోడోర్ హెక్టర్’ అని పేర్కొనడం ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలే వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ డీవోపీ: నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ; యాక్షన్: యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: విఠల్ కోసనం.






