గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుండు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ మహిళా సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలకు సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ గుండు ప్రేమ్ కుమార్ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో మహిళల సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళల సేవలను గుర్తిస్తూ వారికి శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోట్ల ఎల్లయ్య, వార్డ్ మెంబర్లు కోడి శ్రీకాంత్, జనగం రాజకుమార్, ఎడ్ల ఎట్లా అరుణ్, సంధ్య, అనిత, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సునీల్ రెడ్డి, రవ, ఇంద్రారెడ్డి, బాల్ రెడ్డి మరియు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.




