27 July, 2026 | 6:55 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

నేడు ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు

11-06-2026 12:37 AM

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఇంటర్ అడ్వాన్స్‌డ్  సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించారు. మే 13 నుంచి 21 వరకు సప్లమెంటరీ పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ఫలితాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.