30 June, 2026 | 10:12 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ముగిసిన ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్

21-11-2025 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 20 :పాఠశాల స్థాయిలో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో నిర్వహించిన తెలంగాణ ఇంటర్ స్కూ ల్ చాంపియన్‌షిప్ 2025 ఘనంగా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యువ క్రీడాకారులు ఈ చాంపియన్‌షిప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగిం పు వేడుకలకు మల్కాజగిరి ఎంపి ఈటల రా జేందర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు.

ఈ సందర్భంగా మూడురోజుల పాటు ఎటువంటి ఇ బ్బందులు లేకుండా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించిన కన్వీనర్ కె మహేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి వెంకటేశ్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యువ అథ్లెట్లకు చక్కని వేదికగా ఈ చాంపియన్‌షిప్ నిలిచిందని సిఈవో భవాని ప్రసాద్ చెప్పారు. 2030 కామన్‌వెల్స్ గేమ్స్, 2025 ఒలింపిక్స్‌కు పతకాలు సాధించే అథ్లెట్లను గుర్తిం చడమే లక్ష్యంగా దీనిని నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ పోటీలు విజయవంతం చేసిన అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు, వాలంటీర్స్, క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రీడాసంఘాల ప్రతినిధులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.