కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్
ఎనిమిది కిలోమీటర్లు దొంగలను చేజింగ్ చేసి పట్టుకున్న పోలీసులు
మూడు గ్రామాల ప్రజలు సహకారంతో ఎట్టకేలకు చిక్కిన వాహనాల చోరీ ముఠా
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠాను కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఎల్లారెడ్డిలో డిఎస్పి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్ జిల్లా వాహనాల దొంగల ముఠా వివరాలను వెల్లడించారు. అర్ధరాత్రి 8 కిలోమీటర్లు చేజింగ్ చేసి దొంగల ముఠాను పోలీసులు గ్రామస్తుల సాయంతో పట్టుకున్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట చెందిన మహమ్మద్ సబ్బుద్దిన్ కు చెందిన ఆటో టి ఎస్17 టీ0997 జూన్ 2 న ఇంటి ముందు పార్కు చేసి ఉండగా జూన్ 3న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆటో చోరీకి గురైంది.
బాధితుని ఫిర్యాదు మేరకు నాగిరెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు బ్లూ కోర్ట్, పోలీసులు గోపాల్పేట్ బస్టాండ్ లో ఉండగా ఇద్దరు రెండు బైకులపై వచ్చి అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పెట్రో కార్ పోలీసు సిబ్బంది వెంబడించారు. ఒక బైక్ ను వదిలి మరో బైక్ పై ఇద్దరు పరారయ్యారు. ఈ విషయాన్ని పోలీస్ సిబ్బంది నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ కు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు పోచారం వద్ద పెట్రో కార్ ను అడ్డంగా పెట్టిన పోలీసులను చూసి నిందితులు తప్పించుకొని ఎల్లారెడ్డి వైపు వెళ్లారు. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ రంగంలోకి దిగి వెంబడించారు.
మాల్ తుమ్మెద గేటు వద్ద నిందితులు బైక్ ను వదిలి పొలాలలో నుంచి పరారి అయ్యేందుకు ప్రయత్నించారు. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్, మెదక్ జిల్లా జక్కన్నపేట సర్పంచుకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సాయం తో టార్చ్ లైట్ లు పట్టుకొని దొంగలను వెంబడించారు. దీంతో దొంగలు ఆటోను రప్పించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోచారం చెరువు కట్ట వద్దకు ఆటోలో వచ్చిన దొంగలను పెట్రో కార్ పోలీసులు వెంబడించారు. దీంతో ఆటోను వదిలి పొలాల్లోకి దొంగలు పరారయ్యారు. మెదక్ జిల్లా జక్కన్నపేట గ్రామస్తులతో పాటు పోచారం గ్రామస్తులు, మాల్ తుమ్మెద గ్రామస్తులు దొంగలను వెంబడించారు.
అర్ధరాత్రి 8 కిలోమీటర్లు వరకు పోలీసులు దొంగలను వెంబడిస్తూ చేజింగ్ చేశారు. ఎట్టకేలకు పోలీసులకు నలుగురు చిక్కారు. మరో ముగ్గురు పరారయ్యారు. పట్టుబడిన వారు అంతర్ జిల్లా వాహనాల దొంగల ముఠా సభ్యులుగా నిందితులు ఒప్పుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బడిన వారిలో చింత బాలరాజు పై 43 కేసులున్నాయి. షేక్ ఫయాజ్ పై 42 కేసులు ఉన్నాయి. ఇతడు పరారీలో ఉన్నాడు. కార్తీక్ రెడ్డి పై మూడు కేసులు, ఆటి రమేష్ పై ఒక కేసు, మరో కరి పై మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు.
పట్టుబడ్డ నిందితులు 6 జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డారు. కామారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించినట్లు డిఎస్పీ తెలిపారు. అంతర్ జిల్లా వాహనాల దొంగల ముఠాను పట్టుకున్న నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ ను, పెట్రో కార్, బ్లూ కార్ట్ పోలీసులు సురేష్ గౌడ్, సుదర్శన్ ,వాజిద్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్లు డి.ఎస్.పి తెలిపారు. పోలీసులకు సహకరించిన మాల్ తుమ్మెద, పోచారం, మెదక్ జిల్లా జగ్గంపేట గ్రామస్తులను ఎస్పీ అభినందించారు, గ్రామస్తులు పోలీసుల సహకారంతో దొంగల ముఠాను పట్టుకోవడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, నాగీరెడ్డి పెట్ ఎస్సై భార్గవ్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






