2 August, 2026 | 1:53 PM

కొట్టాల పోచమ్మ బోనాల పండుగలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి

02-08-2026 12:58 PM

బోథ్, ఆగస్ట్ 2 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించిన కొట్టాల పోచమ్మ బోనాల పండుగ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, తో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి జాదవ్ బలి రామ్ పాల్గొని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనాల పండుగ విశిష్టతను వారు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న, ఆత్మ చైర్మన్ జి .రాజు యాదవ్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్యుతానంద రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కొట్టాల రమేష్ రెడ్డి తో పాటు పలువురు ఉన్నారు.